News November 19, 2025

మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. ​నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.

Similar News

News November 23, 2025

విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

image

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.

News November 23, 2025

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

image

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.