News November 19, 2025
మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.
Similar News
News February 14, 2026
విశాఖ: కోస్టల్ కారిడార్‌లో మార్పులు

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News February 14, 2026
VMRDA మాస్టర్ ప్లాన్ రివిజన్..

VMRDA మాస్టర్ ప్లాన్-2041ని రివిజన్ చేస్తోంది. గత డ్రాఫ్ట్‌పై వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సవరణలు చేపట్టింది. మార్చి 10 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. 4,380 చ.కి.మీ.ల పరిధిలో పట్టణాభివృద్ధి, రవాణా సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించే ముందు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
News February 14, 2026
విశాఖ: అరుదైన రక్తం 57వసారి దానం

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్‌లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.


