News November 19, 2025
మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.
Similar News
News February 14, 2026
విశాఖ: కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు

విశాఖలో 17 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఐఎఫ్ఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్ల నిర్వహణలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు నగర ప్రజలు గమనించాలని సూచించారు.
News February 13, 2026
ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

విశాఖలో జరగనున్న ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి పదో తరగతి, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధించాలన్నారు.
News February 13, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 22 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ ఓపెన్ ఫోరమ్‌లో 22 వినతులను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు స్వీకరించారు. వీటిలో జోన్లు భీమిలి-1, మధురవాడ-3, ఈస్ట్-7, సౌత్-2, నార్త్-2, వెస్ట్-1, పెందుర్తి-2, గాజువాక-4 వినతులు ఉన్నాయి. సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


