News January 28, 2026
మద్యం మత్తులో వాహనం నడిపితే జైలుకే: SP

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు చేపట్టిన తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కోర్టు కఠినంగా స్పందించింది. సోమవారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 38 మందిని కోర్టులో హాజరుపరచగా, వారికి జైలు శిక్షలతో పాటు జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
Similar News
News February 15, 2026
అల్లూరి జిల్లాలో తగ్గిన చికెన్ అమ్మకాలు

అల్లూరి, పోలవరం జిల్లాలో శివరాత్రి పండగ సందర్భంగా ఆదివారం చికెన్‌కు డిమాండ్ తగ్గింది. అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి, తదితర ప్రాంతాల్లో చికెన్ దుకాణాల వద్ద రద్దీ లేదు. గతవారం కిలో చికెన్ రూ.280 కాగా, నేడు రూ.240 నుంచి రూ.260కి విక్రయిస్తున్నామని వ్యాపారులు తెలిపారు. చేపలు కిలో రూ.200, మటన్ కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు.
News February 15, 2026
నల్గొండ: ప్రసిద్ధ శైవాలయాలు.. మీరు వెళ్తున్నారా?

☛ వాడపల్లిలో శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి ఆలయం
☛ చెర్వుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం
☛ సూర్యాపేటలో పిల్లలమర్రి శివాలయం
☛ మేళ్లచెర్వులో ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం
☛ ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం
☛ ఆలేరులో కొలనుపాక శివాలయాలు
☛ నాగిరెడ్డిపల్లిలో పాహిల్వంపూర్ గోల్డెన్ శివాలయం
News February 15, 2026
వేములవాడకు చేరుకున్న మంత్రి పొన్నం

వేములవాడలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాత్రి వేములవాడ భీమేశ్వరాలయం గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రాజరాజేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


