News August 7, 2025

మద్యం మత్తులో వాహనాలు నడపకండి: ఎస్పీ

image

మద్యం మత్తులో వాహనాలు నడిపి జీవితాలను చిత్తు చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ దామోదర్ కోరారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News August 30, 2025

ప్రకాశం: బార్ల లైసెన్స్ కోసం 78 దరఖాస్తులు.. కాసేపట్లో లాటరీ..!

image

ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.

News August 30, 2025

చీమకుర్తిలోని క్వారీలో ప్రమాదం

image

చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.

News August 30, 2025

గిద్దలూరులో రైతు బజార్ స్థల సమీకరణకు ఎమ్మెల్యే అశోక్‌కు వినతి

image

గిద్దలూరు పట్టణంలో శుక్రవారం MLA అశోక్ రెడ్డిను జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు రైతు బజారు ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణకు వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోసం కూటమి ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.