News May 12, 2024
మద్యం విక్రయాలు జరిగితే ఫిర్యాదు చేయండి

లోకసభ ఎన్నికల దృష్ట్యా శనివారం సాయంత్రం నుండి మద్యం దుకాణాలు కల్లు కాంపౌండ్లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి వరకు మూసి ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే సమాచారం ఇవ్వాలని సూచించారు. డిటిఎఫ్ – 87126 58840, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ – 87126 58841 వైరా 87126 58844, మధిర 87126 58845, సత్తుపల్లి 87126 58847/ సింగరేణి 87126 58848 సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News July 7, 2025
పాలేరు జలాశయానికి చేరిన నాగార్జున సాగర్ జలాలు

కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి ఆదివారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం నాగార్జున సాగర్ డ్యాం నుంచి 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల అనంతరం ఆదివారం రాత్రి జలాశయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News July 6, 2025
ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఆయా సమీప రీచ్‌ల నుంచి అందిస్తున్నామన్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
News July 6, 2025
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.