News April 1, 2026

మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

Similar News

News April 20, 2026

తణుకు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

image

తణుకు మండలం పైడిపర్రుకు చెందిన అనుమోలు దేవి(31) సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందగా, ఎస్సై జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 20, 2026

భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News April 20, 2026

10 గంటల నుంచి పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.