News January 21, 2026
మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు: ఎస్పీ పరితోశ్

జహీరాబాద్ పట్టణంలోని ఎన్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ‘అరైవ్ అలైవ్–2026’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ పాల్గొని విద్యార్థులు, ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆర్‌ఎల్‌ఆర్ పాఠశాల విద్యార్థి సిద్దేశ్వర్ ప్రదర్శనను ఎస్పీ అభినందించారు. జనపద కళాకారుల పాటలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News February 19, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.
News February 19, 2026
సిద్దిపేట: రూ.500 గ్యాస్ రాయితీ.. ఎదురుచూపులు!

సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బులు కోసం 6 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్‌ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేసినా 6 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. జిల్లాలో 79 వేల లబ్ధిదారులు ఉన్నారు. మరి మీకు సబ్సిడీ పడుతుందా కామెంట్.


