News April 6, 2025
మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.
Similar News
News December 26, 2025
NLG: సీఎం ప్రకటన.. సర్పంచులకు ఊరట!

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,779 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.
News December 26, 2025
NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.
News December 26, 2025
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ

మిర్యాలగూడ డివిజన్ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ అయ్యారు. ఆయనను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. నారాయణ్ అమిత్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.


