News February 1, 2026
మధిరలో ‘నిశ్శబ్దం’.. ఇతర చోట్ల ‘జోరు’

జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే, మధిరలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. వైరా, సత్తుపల్లిపట్టణాల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవగా, మధిరలోని 22వార్డుల్లో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. కేవలం 1,2వార్డుల్లో మినహా మిగిలిన 20 వార్డుల్లో అభ్యర్థుల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఎలాంటి హడావుడి లేకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News February 19, 2026
ఖమ్మం: రిటైర్మెంట్ బకాయిలు అందక విశ్రాంత ఏఆర్‌ఎస్‌ఐ మృతి

ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో 35 ఏళ్లు సేవలందించి 2025 ఫిబ్రవరిలో రిటైరైన ఏఆర్‌ఎస్‌ఐ కే.మైసయ్య కన్నుమూశారు. రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేక ఆయన మరణించడం విషాదం నింపింది. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేసింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
News February 19, 2026
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 19, 2026
చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


