News February 25, 2025
మధిర: శ్రీనివాసరావు పార్ధివదేహానికి భట్టి నివాళి

మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసరావు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి భట్టి విక్రమార్క శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Similar News
News February 25, 2025
ఖమ్మం: మందు బాబులకు షాక్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 25, 2025
తీర్థాల జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం కమిషనర్ సూచనలు

> ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయాలి.> ఇక ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలోని కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి.
News February 25, 2025
సత్తుపల్లిలో GOVT స్కూల్ ఫ్లెక్సీ అదుర్స్

మనం చాలా చోట్ల కార్పొరేట్ స్కూళ్లకు చెందిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు చూస్తుంటాం.. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటూ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతి కచ్చితమంటూ ఫ్లెక్సీ ద్వారా ఆ టీచర్లు ప్రచారం చేస్తున్నారు.