News August 5, 2024
మధురవాడలో మరో కొత్త యూనిట్ మాల్

విశాఖలోని మధురవాడ ప్రాంతంలో మరో కొత్త యూనిట్ మాల్ ఏర్పాటు కానుంది. రామానాయుడు స్టూడియో వద్ద ఈ మాల్‌ను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్, రూరల్ ఎమ్మార్వో పాల్ కిరణ్ సోమవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అంశాలపై అధికారులతో ఆరా తీశారు.
Similar News
News February 12, 2026
విశాఖ: 18 ఏళ్లుగా తప్పించుకుంటున్న నిందితుడి అరెస్ట్

18 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్ రెహనుల్లా సిద్ధిఖీని విశాఖ 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 నుంచి పరారీలో ఉన్న ఇతనిని గాండీవ యాప్, పాన్ (PAN) వివరాల ఆధారంగా చెన్నైలో గుర్తించారు. నిందితుడిపై హత్యతోపాటు పలు కేసులు ఉన్నాయి. ఎస్సై బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
News February 12, 2026
విశాఖ: ఫ్లైట్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చూసుకున్నారా..!

విశాఖలో ఫిబ్రవరి 15-19 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 నౌకాదళ విన్యాసాల నేపథ్యంలో విమానాశ్రయంలో షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. రోజూ ఉదయం 10.45-12.30, సాయంత్రం 4-5.30, 6.30-7.30 మధ్య వైమానిక మార్గం తాత్కాలికంగా మూసివేయనున్నారు. 16 విమానాల రాకపోకలు మారాయి. చెన్నై-విశాఖ-చెన్నై 6E581, 6E881 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
News February 12, 2026
విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.


