News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.
Similar News
News November 17, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.