News February 4, 2026

మనలో ధైర్యాన్ని పెంచే ‘మూలాధార చక్రం’

image

వెన్నెముక చివరన ఉండే ఈ చక్రం మన మనుగడకు పునాది. ఇది సమతుల్యంగా ఉంటే ధైర్యం, ఆర్థిక స్థిరత్వం, సురక్షితమైన భావం కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అస్థిరంగా ఉంటే భయం, అభద్రత, కాళ్ల నొప్పులు వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి రోజూ ‘లం’ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఎరుపు రంగు వస్తువులు వాడటం, నేలపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా భూమితో సంబంధం పెంచుకుంటే ఈ చక్రం శక్తివంతమవుతుంది.

Similar News

News February 15, 2026

IITల్లో అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్.. వేరే క్యాంపస్‌కు వెళ్లి చదువుకునే ఛాన్స్

image

IITలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. TOI కథనం ప్రకారం.. విద్యార్థులు ఒక సెమిస్టర్ పాటు ఇతర IIT క్యాంపస్‌లలో చదువుకోవచ్చు. అక్కడ సంపాదించిన క్రెడిట్లను వారి సొంత IIT గుర్తిస్తుంది. కేవలం ర్యాంకుకు పరిమితం కాకుండా విద్యార్థులకు నచ్చిన కోర్సులను ఇతర IITల్లో నేర్చుకునే స్వేచ్ఛను కల్పించడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం.

News February 15, 2026

‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

image

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

News February 15, 2026

ఘనవిజయం.. సూపర్-8లోకి వెస్టిండీస్, ఇంటికి నేపాల్

image

T20WC: నేపాల్‌పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత నేపాల్ 20 ఓవర్లలో 133/8 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ ఒక్కడే 58 పరుగులతో రాణించారు. అనంతరం విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హోప్ (61*), హెట్మెయిర్ (46*) రాణించారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-C నుంచి సూపర్-8కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. అటు నేపాల్ ఎలిమినేట్ అయింది.