News February 7, 2025
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదినేపల్లి(M) విశ్వనాద్రిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయాసాగర్, సింధూర(20)కు ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సింధూరకు పిల్లలు పుట్టరని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పద్మజ తెలిపారు.
Similar News
News February 23, 2026
నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.
News February 23, 2026
‘అతిథి దేవో భవ’ అంటే అర్థం ఇదే..

‘తిథి’ అంటే ఓ రోజు లేదా సమయం. అదేదీ లేకుండా అకస్మాత్తుగా ఇంటికి వచ్చేవారినే ‘అతిథి’ అంటారు. ఇప్పుడు ఉన్నట్లు పూర్వం సమాచార వ్యవస్థ విస్తృతంగా ఉండేది కాదు. కాబట్టి అతిథులు ఎప్పుడైనా వచ్చేవాళ్లు. అలాంటి అతిథిని దేవుడితో సమానంగా చూడాలనేదే ఈ సూక్తి భావం. తైత్తిరీయ ఉపనిషత్తులోని శీక్షావల్లిలో ఈ ‘అతిథి దేవో భవ’ అని పేర్కొన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథికి అంతటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నమాట!
News February 23, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.


