News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News August 30, 2025
నెల్లూరు జిల్లా గిరిజనులకు గమనిక

నెల్లూరు జిల్లాలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు గిరిజనుల కోసం ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6న కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు.
News August 30, 2025
నెల్లూరు SP కీలక ప్రకటన

శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP కృష్ణకాంత్ వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 30, 2025
పోలీసుల వైఫల్యం లేదు: కోటంరెడ్డి

ప్రాణమంటే ఎవరికైనా తీపేనని.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి చెప్పారు. ‘మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందనే వివాదాలు చుట్టుముట్టాయని అంటున్నారు. నేను మూడోసారి గెలిచి 14 నెలలు అవుతోంది. అందరికీ మంచే చేశాను. ఏ వివాదాల జోలికి నేను వెళ్లలేదు. పోలీసుల వైఫల్యం లేదు. వీడియో గురించి ఎస్పీకి తెలిసిన వెంటనే నాకు చెప్పలేదనే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అని కోటంరెడ్డి అన్నారు.