News September 24, 2024

మనుబోలు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది.దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాలు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.

Similar News

News September 29, 2024

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

image

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

News September 28, 2024

వేదాయపాలెం రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలు

image

నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.

News September 28, 2024

నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’

image

వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.