News April 5, 2024
మనూర్: రూ. 6లక్షల నగదు స్వాధీనం

ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.6 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ నుంచి బాదల్ గావ్ చౌరస్తా వద్ద ఎస్ఐ తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఈ నగదు లభ్యమైంది. సంగారెడ్డిలోని గ్రీవెన్స్‌లో డిపాజిట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 20, 2025
చేగుంట: అడవి పంది ఢీకొని ఒకరి మృతి

చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో బైక్‌ను అడవి పంది ఢీకొట్టడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన బొంది భాను(18), తుమ్మల కనకరాజు(27) బైక్ పై రాజుపల్లి నుంచి కొండాపూర్‌కు వెళ్తున్నారు. పోలంపల్లి శివారులో అడవి పంది అడ్డు రావడంతో ఢీకొట్టి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భాను చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.
News April 20, 2025
మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.
News April 19, 2025
మెదక్: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT