News January 2, 2025

మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న

image

ఊహాగాల‌నాల‌కు తెర‌దించుతూ స్టార్ షూట‌ర్ మ‌నూభాక‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఖేల్ ర‌త్న అవార్డు ప్ర‌క‌టించింది. అవార్డుకు ద‌ర‌ఖాస్తు విషయమై మనూ భాకర్‌కు అవార్డుల కమిటీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌ చెస్ ఛాంపియ‌న్ గుకేశ్ దొమ్మరాజు, పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్‌, హాకీ ప్లేయ‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.

Similar News

News January 5, 2025

డియర్ పవన్ కళ్యాణ్ గారూ.. థాంక్యూ: చెర్రీ

image

‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్‌కు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ’ అని ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను Xలో షేర్ చేశారు. కాగా ఈవెంట్‌లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముడిలాంటి వారని పవన్ చెప్పారు.

News January 5, 2025

Shock: ఆన్‌లైన్‌లో వెతికి తల్లి, నలుగురు చెల్లెళ్ల హత్య

image

లక్నోలో తల్లి, నలుగురు చెల్లెళ్లను <<15036079>>చంపేందుకు<<>> మహ్మద్ అర్షద్, తండ్రి బాదర్ ప్లాన్ చేసిన తీరు వణుకు పుట్టిస్తోంది. నొప్పి తెలియకుండా, ప్రతిఘటించకుండా ఎలా చంపాలో వారు మొబైల్లో వెతికారని దర్యాప్తులో వెల్లడైంది. కూల్‌డ్రింక్స్‌లో డ్రగ్స్, సెడేటివ్స్, విష పదార్థాలు కలిపి అచేతనంగా మార్చడం, సర్జికల్ నైవ్స్, ఇతర టూల్స్‌ను వాడి నరాలు కట్‌చేయడం వంటి మెథడ్స్‌ను సెర్చ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు.

News January 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.