News December 14, 2024
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Similar News
News February 16, 2026
మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2026
మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
News February 16, 2026
మెదక్‌లో నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నందున.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేశామని సూచించారు.


