News February 14, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్‌కి గాయాలు

మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 19, 2025
చరిత్ర సృష్టించి 11 ఏళ్లైంది: హరీశ్‌రావు

స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏళ్ల క్రితం నవ చరిత్రకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం ట్వీట్ చేశారు.
News February 19, 2025
మెదక్: యూనివర్సిటీ కోసం భూమి పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం పాపన్న పేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమికి సంబంధించి వివిధ ప్రదేశాలను సంబంధిత ఆర్డీవో రమాదేవి, ఇన్ ఛార్జ్ తహశీల్దార్ మహేందర్ గౌడ్‌తో కలిసి పరిశీలించారు.
News February 18, 2025
MDK: వేతనాలు విడుదల చేయాలని మంత్రికి వినతి

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు విడుదల చేయాలని మంత్రి దామోదర్‌కు ఆ ఉద్యోగ సంఘం నాయకులు శివకుమార్ వినతి పత్రం అందజేశారు. గత 6 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి విన్నవించారు. దీంతో మంత్రి స్పందించి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అధికారికి వివరణ కోరగా వేతనాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.