News December 20, 2025

మన్నెంపల్లిలో వెలుగుచూసిన ‘వీరగల్లు’ శిల్పం

image

KNR(D)తిమ్మాపూర్(M)మన్నెంపల్లిలో పురాతన యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ‘వీరగల్లు’ శిల్పం లభ్యమైందని పురావస్తు పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కరణాలగడీ సమీపంలోని పాలకేంద్రం ఆవరణలో చెత్తాచెదారం శుభ్రంచేస్తుండగా ఈ శిల్పం బయటపడింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున్న నల్లరాతిపై ఒక సైనికుడు కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో కళ్లెం పట్టుకుని యుద్ధంచేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది.

Similar News

News December 21, 2025

ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

image

₹600Cr అదనపు ఆదాయమే లక్ష్యంగా <<18630596>>రైల్వే ఛార్జీలను <<>>పెంచింది. అయితే కొత్తగా ఏం సౌకర్యాలు కల్పించారని ఈ రేట్ల పెంపు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పండుగలొస్తే నిలబడి ప్రయాణించే పరిస్థితి మారలేదు. ముక్కుబిగబట్టి టాయిలెట్‌కు వెళ్లే దుర్భర స్థితిలోనూ మార్పులేదు. సరైన సమయానికి రైలు స్టేషన్‌కు వచ్చిన రికార్డూ లేదు. కరోనాలో ఆగిపోయిన వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించలేదు. మరి ఎందుకు ఛార్జీల పెంపు?

News December 21, 2025

డబ్బు కాదు.. హ్యాపీ లైఫ్ సీక్రెట్ ఇదే

image

డబ్బు, పేరు ప్రతిష్ఠలే సంతోషాన్ని ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సమాజంలో ఉన్న బంధాలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీలో తేలింది. మన అనుకునే కొద్దిమంది ఉన్నా చాలని వారితో సంతోషంగా ఉండొచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అది లేకుంటే ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. నా అనుకునే వారు పక్కన ఉంటే ఆ హ్యాపీయే వేరని తెలిపారు.

News December 21, 2025

సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

image

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకల పర్యవేక్షణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో అర్జీల స్వీకరణను రద్దు చేసినట్లు ఆమె వివరించారు.