News December 28, 2024
మన్మోహన్ పార్థివదేహానికి ఎంపీ వద్దిరాజు నివాళి
ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
Similar News
News December 29, 2024
పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి: డీఐఈఓ
మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.
News December 28, 2024
జనగామ: హెల్ప్ లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన
జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు.
News December 28, 2024
వరంగల్‌కు నాస్కామ్ శుభవార్త!
వరంగల్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.