News December 27, 2024
మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Similar News
News February 19, 2026
పలమనేరులో రూ.13.4 కోట్లకు ఐపీ

పలమనేరులో మరో ఐపీ బాంబు పేలింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్, సీజనల్ వ్యాపారి వెంకటరావు పలువురు దగ్గర అప్పులు తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో 71 మందికి రూ.13.4 కోట్లకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పట్టణంలో చీటీలు నిర్వహించడం, వ్యాపారాల కోసం అప్పులు తీసుకుని ఐపీ పెట్టడం రివాజుగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.
News February 19, 2026
సోమల: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. గాయపడినవారిది చౌడేపల్లిగా స్థానికులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2026
చిత్తూరు: ఉపవాస దీక్షలు ప్రారంభం

జిల్లాలో ముస్లింలు గురువారం ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.


