News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: అంబటి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై వైసీపీ నేత అంబటి రాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పరిపాలనాదక్షుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు. కాగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2004-2014 వరకు ప్రధానిగా సేవలందించారు.
Similar News
News December 22, 2025
PGRSని సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజలు https://Meekosam.ap.gov.inలో లేదా నేరుగా అయినా అర్జీలను సమర్పించవచ్చని అన్నారు.1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమర్పించిన అర్జీల పురోగతిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 21, 2025
జిల్లాలో తొలిరోజే 97.9% పోలియో చుక్కల పంపిణీ: DMHO

గుంటూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. నిర్దేశించిన 2,14,981 మంది చిన్నారులకు గాను 2,08,735 (97.9%) మందికి చుక్కలు వేసినట్లు DMHO విజయలక్ష్మీ తెలిపారు. మురికివాడలు, ప్రమాదకర ప్రాంతాల్లోని 2,434 మందికి, ప్రయాణాల్లో ఉన్న 1,474 మందికి కూడా మందు వేశారు. ఆదివారం కేంద్రాలకు రాని పిల్లల కోసం సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని ఆమె పేర్కొన్నారు.
News December 21, 2025
డ్రగ్స్ దేశ భద్రతకే ముప్పు: ఆకే రవికృష్ణ

డ్రగ్స్ వినియోగం కేవలం ఆరోగ్యానికే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పు అని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన ‘రోటోఫెస్ట్-2025’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల కదలికలపై అనుమానం వస్తే వెంటనే 1972 నంబర్‌కు సమాచారం అందించాలని ఐజీ పిలుపునిచ్చారు.


