News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: టీపీసీసీ చీఫ్

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.

Similar News

News December 27, 2024

మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ నివాళులు

image

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ఆయన మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణిని పరామర్శించారు.

News December 27, 2024

కామారెడ్డి: UPDATE.. అనుమానంతో భార్య హత్య

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అవుసులతండాలో మహిళను ఆమె <<14980915>>భర్త కత్తితో నరికి చంపిన<<>> విషయం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి వివరాలను ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. అవుసులతండాకు చెందిన మెగావత్ మోతిబాయి(55) పై ఆమె భర్త షేర్య కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. కాగా బుధవారం ఆగ్రహంతో భార్య మోతిబాయిని హత్య చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News December 26, 2024

NZB: జల్సాల కోసం బైకు దొంగతనాలు

image

నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.