News April 7, 2025

మన్యంకొండలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణం అనంతరం ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మంటపమైన లక్ష్మీ విలాసంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి స్వామివారిని అలంకరించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో మన్యంకొండ పులకించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారిని భక్తులు దర్శించుకున్నారు.  

Similar News

News September 14, 2025

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ అన్నమయ్యకు బదిలీ

image

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ కే.ధీరజ్ ను అన్నమయ్య జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ధీరజ్ శిక్షణ పూర్తి చేసుకుని, 2023లో పాడేరు ఏఎస్పీగా తొలి పోస్టింగ్ లో చేరారు. తరువాత రంపచోడవరం ఏఎస్పీగా పనిచేస్తూ గత ఏడాది జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. తాజాగా జరిగిన బదిలీల్లో అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యారు.

News September 14, 2025

జన్నారం: భూమి కోసమే ఉద్యమం!

image

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి మండలాల్లో పోడు భూముల సమస్య జటిలమవుతోంది. జన్నారం మండలం పాలగోరిలో తమ పూర్వీకుల భూములను అప్పగించాలని ఆదివాసులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో దండేపల్లి మండలం లింగాపూర్, దమ్మన్నపేటలో కూడా ఆదివాసులు అటవీ భూములు ఇవ్వాలని పోరు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందికి, ఆదివాసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో రెండు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

News September 14, 2025

KMM: డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు రావాలని సూచించారు. అడ్మిషన్ల వివరాలను ఈనెల 17న ‘దోస్త్’ పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.