News February 10, 2025

మన్యంకొండ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి హంస వాహన సేవ

image

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News March 2, 2026

ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ TGలో పర్యటించనున్నారు. ఉ.9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వికారాబాద్(D) అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేయనున్నారు. AP, TG కాంగ్రెస్ ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులనూ రాహుల్ కలిసే అవకాశం ఉంది.

News March 2, 2026

ఈనెల 15లోగా పరిహారం అందిస్తాం: మంత్రి పొంగులేటి

image

TG: వెలుగుమట్ల <<19243377>>భూవివాదాన్ని<<>> ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఈనెల 15లోపు ఇళ్ల స్థలాలతో పాటు ₹5లక్షల పరిహారం ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అక్రమ గృహాల తొలగింపుతో ₹250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 2, 2026

ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులు బ్రేక్!

image

విండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్ రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ (15) రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ (97*) స్కోర్ చేసి విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ అధిగమించారు. కోహ్లీ 2016లో AUSపై, 2022లో PAKపై ఈ రన్స్ చేశారు. T20Iల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కిన ఇండియన్ కీపర్‌ కూడా సంజూనే.