News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News March 12, 2025
GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2025
MBNR: యాసంగి పంటలను పరిశీలించిన కలెక్టర్

ఈ వేసవిలో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వారికి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులు ఆదేశించారు. కోయిలకొండ మండల పరిధిలోని సంగనోని పల్లి సేరి వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేసవి పంటలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండలకు నీటి జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించారు.
News March 11, 2025
MBNR: విద్యార్థుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కోయిలకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థులుకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ రుచిచూసి భోజనంపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ దృష్టికి వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.