News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News December 27, 2025
శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
News December 27, 2025
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.
News December 27, 2025
తల్లిదండ్రులు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్‌గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆరునెలలు రాగానే ఘనపదార్థాలు నెమ్మదిగా అలవాటు చెయ్యాలి. అప్పుడే నాలుకకు వ్యాయామం అందుతుందంటున్నారు. అలాగే సిప్పీ కప్పుల వాడకం తగ్గించాలి. దీనివల్ల కూడా మాటలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాటలు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


