News February 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.
Similar News
News September 18, 2025
నిర్మల్: ‘మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య అన్నారు. గురువారం పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేదరులను ఆదుకునేందుకు మేదరి బంధు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే అందించాలని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.
News September 18, 2025
కొత్తగూడెం: ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి

జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని TTSF, GVS నాయకులు కోరారు. గురువారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. టీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్, జీవీఎస్ కార్యదర్శి బాలాజీ నాయక్, జానకీరామ్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా హక్కు చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.