News November 10, 2025
మన్యం: అవిగో గజరాజులు.. గుండెల్లో గుబులు

మన్యం జిల్లాను ఏనుగుల గుంపు వదలడం లేదు. పాలకొండ నియోజకవర్గం నుంచి.. పార్వతీపురం వరకు సంచరిస్తూ మన్యం వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారే తప్ప వాటి తరలింపునకు చర్యలు చేపట్టడం లేదని.. కుంకీ ఏనుగులు తెచ్చి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. సోమవారం కొమరాడ (M) వన్నం, మాదలంగి పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించింది.
Similar News
News November 10, 2025
ములుగు గజ గజ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

అకాల వర్షాలతో ఆగమైన ప్రజలకు చలి రూపంలో మరో విపత్తు ఎదురవుతోంది. రేపటి నుంచి పది రోజులపాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పగలు, రాత్రి సమయాల్లో 10-14 డిగ్రీలు పడిపోతుందని పేర్కొంది. ఈరోజు నుంచే ములుగు ఏజెన్సీలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం బారేడు పొద్దెక్కినా ఎక్కిన చలి ప్రభావం తగ్గలేదు. గోదావరి పరివాహక అటవీ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
News November 10, 2025
ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలి: కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 11 నిర్వహించే సర్దార్ ఏ-150 ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉదయం 9:30 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలోని విద్యార్థులు, యువత, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.


