News March 19, 2024

మన్యం: ‘గోడలపై రాతలకు అనుమతి లేదు’

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్‌లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.

Similar News

News April 3, 2025

కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

News April 3, 2025

VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్ష‌ణ‌

image

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాల‌కు చెందిన అభ్య‌ర్ధుల‌కు ఈనెల 10వ తేదీ నుంచి న‌గ‌రంలో ఉచిత కుట్టు శిక్ష‌ణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్ర‌శాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వ‌ర్యంలో వీటీ అగ్ర‌హారంలో నిర్వ‌హిస్తున్న స్కిల్ హ‌బ్‌లో ఉచిత శిక్ష‌ణ ఉంటుందన్నారు. SC వ‌ర్గానికి చెందిన 18 నుంచి 45 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గల మ‌హిళ‌లు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.

News April 3, 2025

కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

image

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!