News October 14, 2025

మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులు: DEO

image

మెగా DSC ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించినట్లు DEO రాజ్ కుమార్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు 97 మంది, 103 మంది ఎస్జీటీలు జాయిన్ అయ్యారు. సాలూరులో 39, బలిజిపేటలో 20, గుమ్మలక్ష్మిపురంలో 18, గరుగుబిల్లిలో 8, జియ్యమ్మవలసలో 21, కొమరాడలో 9, కురుపాంలో 21, మక్కువలో 14, పాచిపెంటలో 28, పార్వతీపురంలో 19, సీతానగరంలో ముగ్గురు విధుల్లో చేరినట్లు చెప్పారు.

Similar News

News October 14, 2025

HYD: జాతీయ సదస్సు.. OU ప్రొ.మాధవి ప్రసంగం

image

మహారాష్ట్రలోని నాందేడ్‌ యశ్వంత్ మహావిద్యాలయంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-UShA) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ మేరకు OUలోని జువాలజీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎం.మాధవిని ఆహ్వానించింది. ‘విక్షిత్ భారత్ కోసం ఆరోగ్యం, ఆహారం, స్థిరత్వం భవిష్యత్తును రూపొందించడం’ అనే అంశంపై ప్రొఫెసర్ మాధవి అంతర్దృష్టితో కూడిన ఆకర్షణీయమైన ప్రసంగం ఇచ్చారు.

News October 14, 2025

KNR: ‘పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో నమోదు పెరగాలి’

image

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంఈఓలు, ఎంపీడీవోలు, సీడీపీవోలతో పూర్వ ప్రాథమిక పాఠశాలలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ కేంద్రాలలో నమోదును పెంచాలని, ప్రతి కేంద్రంలో 20 మంది పిల్లలు తగ్గకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తదితరులు ఉన్నారు.

News October 14, 2025

16న గండిక్షేత్రంలో వేలం

image

చక్రాయపేట మండలం గండిక్షేత్రం శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయల విక్రయాలు, వివాహాలు జరిపించడం, ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ సప్లయర్స్‌కు సంబంధించి వేలం జరుగుతుంది. ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహిస్తారు.