News October 5, 2025

మన్యం జిల్లాలో మరో 3 గంటల్లో ఉరుములతో వర్షం

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని రాబోయే 3 గంటల్లో పలుచోట్ల ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి ప్రాంతాలలో కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో వర్షం పడుతుందని వెల్లడించారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Similar News

News October 6, 2025

మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది: ఎంపీ కావ్య

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మన అందరి లక్ష్యమని ఎంపీ కడియం కావ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిడిగొండలో జరిగిన నియోజక వర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా కడుపు కట్టుకొని పనిచేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమదేనని అన్నారు.

News October 6, 2025

క్రమం తప్పకుండా తరగతులకు రావాలి: ADB DIEO

image

దసరా సెలవులు ముగిశాయని.. ఇంటర్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ముఖ గుర్తింపు (Face Recognition) సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తామన్నారు. ఈ హాజరును అంతర్గత, ప్రాక్టికల్ IPE 2026 థియరీ పరీక్షలలో పరిగణలోకి తీసుకుంటామన్నారు.

News October 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.