News March 4, 2025

మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డీఆర్డీఏ పరిధిలోని సమస్యలు గుర్తించి.. వాటిని పరిష్కరించేలా అడుగులు వేయాలన్నారు.  

Similar News

News March 4, 2025

చీపురుపల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News March 4, 2025

బాపట్ల జిల్లాలో TODAY TOP HEADLINES

image

★చిన్నారిపై లైంగిక దాడి.. రంగంలోకి క్లూస్ టీం★ఆలపాటి ప్రస్థానం మొదలైంది ఇలా.!★ 2 సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!★అత్యంత పేదరిక జిల్లాల్లో బాపట్ల జిల్లాకు 4వ స్థానం★శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు.!★మాజీ MLA ఇంటి ముందు TDP శ్రేణుల సంబరాలు★ జగన్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: అనగాని★ కారంచేడులో రోడ్డు ప్రమాదం

News March 4, 2025

ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!