News February 5, 2026

మన్యం జిల్లా పోలీస్ విభాగంలో కృత్రిమ మేధస్సు: ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు AI సేవలు విశ్వసనీయ సహాయకుడిగా ఉపయోగపడుతుందని ఎస్పీ మాధవ్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున పోలీస్ శాఖకు కూడా కృత్రిమ మేధస్సు తోడ్పడుతుందన్నారు. సాఫ్ట్‌వేర్‌తో ఏ ప్రాంతాల్లో నేరాలు జరుగుతున్నాయో అంచనాలకు దోహదపడుతుందన్నారు.

Similar News

News February 5, 2026

సంగారెడ్డి: పెళ్లికి రూ.25,111, పుడితే రూ.11,111

image

మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు తమ హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సదాశివపేటలో ఓ అభ్యర్థి తమను గెలిపిస్తే ఆడబిడ్డ పెళ్లికి రూ.25,111, ఆడబిడ్డ జన్మిస్తే రూ.11,111, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఇల్లు లేని పేదవాడికి ఇంటి స్థలం, ఇంటి రుణం ఇప్పిస్తామని అభ్యర్థులు హామీలను గుప్పిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలానే హామీలు ఇస్తున్నారా కామెంట్ చేయండి!

News February 5, 2026

VZM: బార్ లైసెన్సుల మంజూరుకు లాటరీ తీసిన కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 11 బార్ లైసెన్సుల మంజూరుకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ లాటరీ కోసం మొత్తం 6 కౌంటర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టారు. 11 బార్ లైసెన్సులకు మొత్తం 62 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వం రూ.3.10 కోట్ల ఆదాయం పొందిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News February 5, 2026

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>AIIMS <<>>గోరఖ్‌పూర్ 22 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MBBS అర్హత గలవారు ఫిబ్రవరి 11న, BDS అర్హత గలవారు ఫిబ్రవరి 14న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 +NPA చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in