News October 29, 2025

మన్యం జిల్లా ప్రజలకు జేసి సూచనలు

image

తుఫాన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. వేడి నీరుగాని క్లోరినేటెడ్ నీరుగాని తాగాలన్నారు. అధికారిక సమాచారం వచ్చేంతవరకు బయటకు వెళ్లొద్దని, విరిగిన విద్యుత్ స్తంభాలు తెగపడిన వైర్ల వద్దకు వెళ్లొద్దని దెబ్బతిన్న లేదా పడిపోయిన భావనాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. కొండవాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారుల సూచనలు పాటించాలన్నారు.

Similar News

News October 30, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News October 30, 2025

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై సీఎం చర్చ: మంత్రి టీజీ

image

కర్నూలులోని ఏ, బీ, సీ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బుధవారం ఎస్‌బీఐ కాలనీలో నగర అభివృద్ధిపై కేఎంసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలులోనే బెంచ్‌ ఉంటే బాగుంటుందని సీఎం కూడా చెప్పారని తెలిపారు. కర్నూలును ‘స్మార్ట్ సిటీ’గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News October 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.