News February 7, 2025
మన్యం బంద్‌కు ఆదివాసి ఉద్యోగ సంఘాల మద్దతు
ఈ నెల 12న తలపెట్టిన మన్యం బంద్‌కు ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదివాసి ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సోడే నారాయణ గురువారం అన్నారు. చింతూరులో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. 1/70 చట్టం సవరణ చేయడానికి అధ్యయనం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించడం మంచిది కాదన్నారు. ఇప్పటికే మాకు జీవనాధారమైన జీవో నంబర్-3ని దూరం చేశారన్నారు. బంద్ పిలుపుకు ఉద్యోగ జేఏసీ మద్దతు ఉంటుందన్నారు.
Similar News
News February 7, 2025
వికారాబాద్ జిల్లాలో 70,219 మందికి రైతు భరోసా
రెండో రోజుల్లో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 70,219 మంది రైతుల ఖాతాలో రూ.32,99,94,264 కోట్లు జమయ్యాయని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలో డబ్బులు జమవుతాయన్నారు.
News February 7, 2025
ఖమ్మం: వినూత్న ప్రయోగం.. విద్యార్థులకు కలెక్టర్ లేఖ
పదో తరగతి ఫలితాల్లో 100% సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ధైర్యంగా హాజరయ్యేలా సిద్ధం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సదస్సుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరు కాగా మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రతీ విద్యార్థికి తన సంతకంతో కూడిన లేఖ అందించాలని ఆయన నిర్ణయించారు. ఈవిషయమై డీఈవో ఉద్యోగులతో లేఖ తయారీపై సమీక్షించారు.
News February 7, 2025
అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస
మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు.