News December 10, 2025

మన్యం: బాబోయ్ వణుకు..!

image

పాచిపెంటలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 4 దాటిన తరువాత చలి తీవ్రత పెరిగి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట మంచు అధికంగా పడటంతో 7 గంటలు దాటితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? కామెంట్

Similar News

News April 3, 2026

కల్తీ పాలపై ఉక్కుపాదం: కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అనధికారిక పాల విక్రయాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాలను అరికట్టేందుకు పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా FSSAI వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యమైన పాలు మాత్రమే విక్రయించాలని ఆమె స్పష్టం చేశారు.

News April 3, 2026

మేడ్చల్: వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO ఉమాగౌరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అంకితభావంతో పని చేయాలన్నారు. రోగుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, కాలం చెల్లిన మందులపై జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

News April 3, 2026

పేర్ని నానిపై పెట్టిన సెక్షన్లు ఇవే..!

image

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరితోటలో ఓ అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని పరామర్శ పేరుతో అక్కడకు వచ్చి మీడియా ముందు పోలీసులను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను బహిరంగంగా బెదిరించడంతోపాటు ఇనగుదురు సీఐ బాడీని షేమింగ్ చేస్తూ పేర్ని మాట్లాడారు. దీనిపై పోలీసులు ఆయనపై BNS 196, 353(2), 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.