News May 8, 2024

మన్యం: ‘సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం’

image

సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకుల ఓరియంటేషన్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని అన్నారు.

Similar News

News November 29, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

News November 28, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

News November 28, 2024

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి: మంత్రి

image

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.