News November 1, 2025
మన ఆచారం ప్రకారం.. చెవిలో నూనె చుక్కలు ఎందుకు వేసుకుంటారు?

దీపావళి వంటి కొన్ని పండుగలప్పుడు రెండు, మూడు నూనె చుక్కలను చెవిలో వేసుకునే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శ్రేష్ఠం. ఈ కర్ణాభ్యంగం అన్ని చెవి సమస్యలతో పాటు మెడ బిగిసిపోవడం, దౌడ బిగిసిపోవడం, చెవిలో శబ్దం వంటి సమస్యలు దరిచేరనివ్వదు. ఫలితంగా చెవులకు, పాదాలకు చల్లదనం కలిగి, ఒత్తిడి తగ్గి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శ్రవణ వ్యవస్థ కోసం దీన్ని పాటించడం మంచిది.
Similar News
News November 1, 2025
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

AP: విశాఖలో సాయితేజ్(21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 1, 2025
258 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 1, 2025
నవంబరులో మామిడి తోటల పెంపకంలో జాగ్రత్తలు

అక్టోబరు ఆఖరు నుంచే మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుంది. పూత సరిగా రాని మామిడి చెట్లలో, పూత రావడానికి ఎథ్రిల్ అనే హార్మోను మందును సిఫారసు చేస్తారు. ఈ హార్మోనును నవంబరు నెల నుంచి డిసెంబర్ వరకు 2 వారాలకు ఒకసారి చొప్పున 4 సార్లు లీటరు నీటికి 2ml చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత సరిగా రాని చెట్లలో ఇది మంచి ఫలితాలనిస్తుంది.


