News December 19, 2025
మన ఎర్రబంగారం బ్రాండ్ అంటే ఇదీ..!

TPT: శేషాచలంలో దొరికే ఎర్రచందనంతో సోపులు, లిప్ స్టిక్‌లు తయారు చేస్తున్నారు. ఇలా రూపొందించిన రాయలసీమ RS సోప్‌కు ట్రైడ్ మార్క్, రాయల్ రెడ్ లిప్ స్టిక్‌కు BIS సర్టిఫికెట్ రావడం మన ఎర్రబంగారం విశిష్టతను చాటిచెబుతోంది. ఏపీ వ్యాప్తంగా 1,513 రకాల ఎర్రచందనం జన్యుకణాలను సర్వేలో గుర్తించారు. భవిష్యత్తు తరాలకు మేలైన ఎర్రచందనం అందించాలనే ఉద్దేశంతో ఈ జన్యుకణాల సంరక్షణకు బ్యాంకును సైతం ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News December 19, 2025
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News December 19, 2025
విశాఖ: ‘పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు’

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామన్నారు.
News December 19, 2025
పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.


