News December 22, 2025

మన క్రమశిక్షణ కోసమే ఆయన విలయ తాండవం

image

‘ఓం భీమాయ నమః’ – భీమ అంటే భయంకరమైనవాడని అర్థం. దుష్టులకు, అధర్మానికి శివుడు ప్రళయకాల రుద్రునిలా భయం కలిగిస్తాడు. అయితే ఈ భయం వినాశనం కోసం కాదు! సృష్టిలో క్రమశిక్షణను, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అహంకారాన్ని రూపుమాపడం కోసం. ఆయన సన్మార్గులకు రక్షణ కవచం. చెడు ఆలోచనలు, భయాలు భస్మం చేసే శక్తి ఆ పరమేశ్వరుడు. క్రూరత్వాన్ని అణిచివేసి విశ్వశాంతిని నెలకొల్పే ఆ దైవ బల పరాక్రమాలకు ఈ నామం సూచిక. <<-se>>#SHIVANAMAM<<>>

Similar News

News December 23, 2025

నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

image

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్‌(D) రసూల్‌పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

News December 22, 2025

ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం: మంత్రి

image

TG: భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థకు సంబంధించి జ‌న‌వ‌రిలో ఆధునీక‌రించిన డిజిటల్ వ్య‌వ‌స్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌ కిందకి తీసుకొచ్చి “భూభార‌తి”తో లింక్ చేస్తాం. ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం వస్తుంది. స‌ర్వే నంబ‌ర్లకు మ్యాప్‌ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

బిగ్‌బాస్ విన్నర్‌ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

image

నిన్నటితో ముగిసిన బిగ్‌బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్‌.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.