News February 2, 2026
మన జిల్లా టాప్ టెన్‌లో ఉండాలి: డీఈవో

బుక్కరాయసముద్రంలో నిర్వహించిన రెసిడెన్షియల్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో డీఈవో ప్రసాద్ బాబు పాల్గొన్నారు. 5 రోజుల ట్రైనింగ్‌లో నేర్చుకున్న విషయాలను మీస్కూళ్లలో అమలు చేయాలని KGBV ప్రిన్సిపల్స్ & హాస్టల్ వార్డెన్లకు సూచించారు. రాబోవు 2 నెలలు కీలకమని, పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి సన్నద్ధం చేయాలన్నారు. రిజల్ట్స్ విషయంలో అనంతపురం జిల్లా టాప్ 10లో ఉండేలా చూడాలన్నారు.
Similar News
News February 6, 2026
అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు అందని ఐరన్ సిరప్

అనంతపురం జిల్లాలో ఉన్న 2,302 అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు ఐరన్ సిరప్ వేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. వారానికి 2 సార్లు వేయాలని, ఐరన్ సిరప్‌ల స్టాక్ లేదని ANM, ఆశా వర్కర్లు చెబుతున్నారు. ఈ విషయంపై DMHO దేవిని సంప్రదించగా.. పిల్లలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.
News February 6, 2026
అవార్డు అందుకున్న తాడిపత్రి బుడ్డోడు

తాడిపత్రికి చెందిన 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బుడతడు సీహెచ్ 126.. సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇటీవల ఒలింపియాడ్ పరీక్షలలో సత్తాచాటి 3వ స్థానంలో నిలిచాడు. హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా 33వ సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డు అందుకున్నారు.
News February 5, 2026
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.


