News November 26, 2025
మన జిల్లా మార్కాపురం!

★ జిల్లా కేంద్రం: మార్కాపురం
★ నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు
★ రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి
★ జనాభా: 11 లక్షలు
★ మండలాలు (21): యర్రగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, హనుమంతునిపాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారపేట
Similar News
News January 30, 2026
ప్రకాశం జేసీగా కల్పనా కుమారి

ప్రకాశం జిల్లా జేసీగా కల్పనా కుమారి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబును జేసీ కల్పనకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు.
News January 30, 2026
నేడు ఒంగోలుకు రానున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ఒంగోలుకు రానున్నట్లు జిల్లా వైసీపీ కార్యాలయం ప్రకటించింది. నాలుగు గంటలకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ఏం మాట్లాడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.
News January 30, 2026
ప్రకాశం: స్వచ్ఛ రథం ఆపరేటర్ల కోసం దరఖాస్తులు

ప్రకాశం జిల్లాలో పొడి చెత్త నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చ రథం ఆపరేటర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. మొత్తం 22 మండలాల పరిధిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు, ఆపరేటర్లు మూడు సంవత్సరాల స్క్రాప్ నిర్వహణ అనుభవం, ట్రేడ్ లైసెన్స్ సైతం కలిగి ఉండాలని సూచించారు.


