News November 26, 2025

మన జిల్లా మార్కాపురం!

image

★ జిల్లా కేంద్రం: మార్కాపురం
★ నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు
★ రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి
★ జనాభా: 11 లక్షలు
★ మండలాలు (21): యర్రగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, హనుమంతునిపాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారపేట

Similar News

News February 6, 2026

సంతనూతలపాడు వద్ద గంటలు తరబడి ట్రాఫిక్

image

సంతనూతలపాడులో ఎండ్లూరు డొంక వద్ద రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా సంతనూతలపాడు నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై నుంచి భారీ వాహనం భారీ లోడుతో కల్వర్టుపైకి రాగానే ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

News February 6, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th పరీక్షల ఫీజు గడువు పెంపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా DEO రేణుక చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని సూచించారు.

News February 6, 2026

ప్రకాశం జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు,మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 16. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.