News April 16, 2024
మన తూర్పుగోదావరిలోకి నేడు CM జగన్ ENTRY

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర మంగళవారం తూ.గో.జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలోని సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన లేఔట్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో రాత్రి బసచేస్తారు. 17న శ్రీరామనవమి నేపథ్యంలో ప్రచారానికి విరామం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు.
Similar News
News October 7, 2025
ఈనెల 8 నుంచి సదరం శిబిరాలు: కలెక్టర్

జిల్లాలో అప్పీలు చేసుకొన్న దివ్యాంగుల పెన్షన్ల అంచనాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సదరం శిబిరాలను ఈ నెల 8 నుంచి GGH, రాజమండ్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. తక్కువ శాతం దివ్యాంగత్వం ఉండి, పెన్షన్ పొందడానికి అర్హత లేని వారిగా గతంలో నోటీసులు అందుకొన్న వారికి పునఃపరిశీలన చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.
News October 7, 2025
రాజనగరం: బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

రాజానగరం మండలం నందరాడ సమీపంలో మంగళవారం రాత్రి 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కోరుకొండ నుంచి స్కూటీపై వస్తున్న రాజానగరానికి చెందిన బుద్ధిరెడ్డి సత్యనారాయణ (36), కొవ్వూరు నుంచి బైకుపై కోరుకొండ వెళ్తున్న మెర్ల శ్రీనివాసరావు (45) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ప్రియ కుమార్ తెలిపారు.
News October 7, 2025
బస్సు ఆపి పంట కాలువలో దూకిన ఇంటర్ విద్యార్థి

ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో మంగళవారం విద్యార్థి కే పూజిత పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మోర్త గ్రామానికి చెందిన పూజిత వెలివెన్నులో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. విద్యార్థి కళాశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వాంతులొస్తున్నాయని బస్సు ఆపింది. బస్సు దిగి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూకింది. విద్యార్థి కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.