News January 6, 2026

మన నీటి సమస్యపై సరైన రీతిలో వాదన వినిపించాలి: మాధవ్

image

ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చెయ్యాలని, బలమైన వాధన వినిపించాలన్నారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపే ముందు, ప్రయాణికుల రాకపోకల సరళి, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిపై రాబడి వంటి అనేక అంశాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంగళవారం తెలిపారు.

Similar News

News February 21, 2026

667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>మహానది <<>>కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 667 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా(మైనింగ్, పాథాలజీ), డిగ్రీ(మైనింగ్ Engg., మైనింగ్ సర్వేయింగ్ Engg.), ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, BA అర్హత గలవారు మార్చి 16 -ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: mahanadicoal.in

News February 21, 2026

NGKL: ‘గ్రామీణ బాలికల సాధికారతకు కేజీబీవీలు బలమైన వేదికలు’

image

గ్రామీణ బాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) బలమైన వేదికలుగా నిలుస్తున్నాయని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ పేర్కొన్నారు. బాలికల సాధికారత, నాణ్యమైన విద్య ఉన్నత లక్ష్యాల సాధనలో కేజీబీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు.

News February 21, 2026

HYD: ఒక్క రోజు ఛాన్స్.. ఇన్వెస్ట్‌మెంట్ బజార్

image

తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు TGREDCO ఆధ్వర్యంలో HYDలో ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్‌మెంట్ బజార్” నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి చేర్చి, కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే దీని లక్ష్యం. రాయితీలతో కూడిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.