News January 14, 2026
‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.
Similar News
News January 23, 2026
GNT: సమగ్రశిక్షలో ఖాళీకి దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు సమగ్రశిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఖాళీ భర్తీకి ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం డిప్యూషన్ పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు DEO సలీమ్ బాషా తెలిపారు. 55 సం.ల లోపు కలిగిన ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 5సం.ల సర్వీస్, సెకండరీ గ్రేడ్ టీచర్లు 8 సం.ల సర్వీస్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News January 23, 2026
ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

రాబోయే మూడేళ్లలో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలకు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
News January 23, 2026
RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.


